Monday, 27 July 2020

Telugu Bigg Boss 4: ఇదే నా మొదటి హెచ్చరిక.. కేసు కూడా వేస్తా! హాట్ హీరోయిన్ ఘాటు రియాక్షన్

బుల్లితెర భారీ పాపులారిటీ షో బిగ్ బాస్ హంగామా మరికొద్ది రోజుల్లోనే షురూ కాబోతోంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ప్రోమో వీడియో రిలీజ్ చేశారు నిర్వాహకులు. కాకపోతే షోలో పాల్గొనబోయే పార్టిసిపెంట్స్, హోస్ట్, ఇతర వివరాలను గోప్యంగా ఉంచారు. దీంతో బిగ్‌బాస్ 4 కంటిస్టెంట్స్ వీళ్ళే అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఆ లిస్టులో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో తాజాగా ఈ విషయమై స్పందిస్తూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది ఈ హాట్ బ్యూటీ. ''బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కోసం నన్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. నేను అందులో పాల్గొనడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఇలాంటి వార్త‌లు రాసేముందు కాస్త క్లారిటీ తీసుకుంటే మంచిది. త‌ప్పుడు వార్త‌లు రాసేవారికి ఇదే నా మొద‌టి, చివ‌రి హెచ్చ‌రిక‌. అస‌త్య‌పు వార్త‌లు రాసే వాళ్లు ఇలాగే చేస్తే వారిపై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు కూడా తీసుకుంటా'' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది శ్రద్దా దాస్. ఈ రకంగా బిగ్ బాస్ 4లో శ్రద్దా దాస్ పాల్గొనడం లేదని కన్ఫర్మ్ అయింది. Also Read: మరోవైపు తెలుగు బిగ్ బాస్ 4లో మరోసారి నాగార్జున హోస్టుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షో కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారని, కొరోనా విజృంభణ నేపథ్యంలో బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారికి ప్రత్యేకంగా కోవిడ్‌ టెస్ట్ చేశాకే అనుమతించబోతున్నారని తెలుస్తోంది. ఈ షోని గత సీజన్‌లా 100 రోజులు కాకుండా తక్కువ రోజుల్లోనే ఫినిష్ చేయనున్నారని సమాచారం. ఏదేమైనా బిగ్ బాస్ 4 కోసం ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం విశేషం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ErYaGb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...