Tuesday, 28 July 2020

Nithiin Marriage: నిన్న నిఖిల్ నేడు కాజల్.. ఇద్దరికీ అదే కావాలట!! నితిన్ ఏం చేస్తాడో మరి..!

వేద మంత్రాల నడుమ అగ్ని సాక్షిగా తన ప్రియురాలు షాలిని మెడలో మూడు ముళ్ళేసి ఓ ఇంటివాడయ్యాడు హీరో నితిన్. కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు షాలినిని పెళ్లాడాడు. దీంతో పలువురు సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా నితిన్ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (సోమవారం) నితిన్ పెళ్లిపై స్పందించిన హీరో నిఖిల్.. ''నితిన్ భయ్యా.. కొత్త జర్నీ ప్రారంభించిన నీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీ జోడీ చూడముచ్చటగా ఉంది. కాకపోతే నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్! నిన్ను వదిలేదే లేదు'' అని కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ అగర్వాల్ కూడా అచ్చం అలాగే కామెంట్ చేసి వార్తల్లో నిలిచింది. ''నీకు, షాలినికి ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నా. పార్టీ బాకీ ఉన్నావ్ నితిన్'' అని పేర్కొంటూ ఫోటోలు షేర్ చేసింది కాజల్ అగర్వాల్. సో.. చూస్తుంటే నితిన్ పెళ్లి పార్టీ ఎంజాయ్ చేసేందుకు సెలబ్రిటీలు ఎంతో కుతూహలంగా ఉన్నారని అర్థమవుతోంది. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్న హీరోహీరోయిన్లు పార్టీలో ఛిల్ కావాలని ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి కోవిడ్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టాక సెలెబ్రిటీల కోసం నితిన్ తన పెళ్లి పార్టీ ఏ రేంజ్‌లో అరేంజ్ చేస్తాడో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gjzvlj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...