Thursday, 2 July 2020

Saroj Khan Death: ఫేమస్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం.. ఏమన్నారంటే!

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. యంగ్ హీరో సుశాంత్ మరణం తాలూకు జ్ఞాపకాలు మరచిపోకముందే సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణించారని తెలియడం సినీ వర్గాల్లో విషాదం నింపింది. బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ (71) గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. శ్వాస కోస సమస్యలతో జూన్ 20వ తేదీన బాండ్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరిన సరోజ్‌ఖాన్.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ వెంటనే తన తల్లి గుండెపోటుతో కన్నుమూసిందని సరోజ్‌ఖాన్ కూతురు సైతం ధ్రువీకరించారు. దీంతో ఆమె మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ సంతాపం తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .. సరోజ్‌ఖాన్ మృతి పట్ల స్పందిస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. సరోజ్‌ఖాన్ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు. సరోజ్‌ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. Also Read: నాలుగు దశాబ్దాలుగా 2వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు సరోజ్‌ఖాన్. 80వ దశకంలో ఆమె హవా నడించింది. సరోజ్‌ఖాన్ కొరియోగ్రఫీ అందించిన దేవదాస్ సినిమాలోని 'డోలా రే డోలా’, తేజాబ్‌లో మాధురీ దీక్షిత్ నర్తించిన 'ఏక్ దో తీన్', జబ్ వీ మెట్ సినిమాలోని 'యే ఇష్క్ హై' పాటలకు జాతీయ అవార్డులు లభించాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VGqzy0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...