Saturday, 4 July 2020

Payal Rajput: కమల్ హాసన్‌తో చిందేయనున్న పాయల్.. అందాల ఆరబోత పీక్స్‌లో ఉంటుందట!

యంగ్ హీరోయిన్, పాల బుగ్గల పాప .. సీనియర్ హీరో కమల్ హాసన్‌తో స్టెప్పేసే అవకాశం పట్టేసిందట. హీరోగా 'భారతీయుడు' సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న '' చిత్రంలో పాయల్ చేత అదిరిపోయే ఐటెం సాంగ్ చేయించనున్నారని తెలుస్తోంది. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పాయల్.. తొలి సినిమాతోనే టాలీవుడ్ లోకాన్ని ఫిదా చేసేసింది. బోల్డ్ క్యారెక్టర్ చూపిస్తూనే నటనా పరంగా సత్తా చాటడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే పాయల్ లాంటి అందాన్ని ఐటెం సాంగ్‌లో చూపించాలని డిసైడ్ అయిన డైరెక్టర్ తేజ 'సీత' మూవీలో స్పెషల్ సాంగ్ చేయించి ఆకర్షించారు. దీంతో ఐటెం పాపగా కూడా పాయల్ పేరు తెచ్చుకుంది. Also Read: ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మూవీ 'భారతీయుడు 2'లో ఐటెం సాంగ్ కోసం పాయల్ రాజ్‌పుత్‌ని సెలక్ట్ చేశారట. ఇందుకోసం ఆమెకు రెమ్మ్యూనరేషన్ కూడా ఎక్కువే ఆఫర్ చేశారనేది తాజా సమాచారం. అంతేకాదు ఈ పాటలో అందాల ఆరబోత పీక్స్‌లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుంచాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VMfvPP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...