Friday, 3 July 2020

చిరంజీవి అనగానే ఒప్పుకున్నారు.. సరోజ్ ఖాన్‌తో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న గుణశేఖర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ ఖాన్ (71) కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో యావత్‌ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా రెండు వేలకు పైగా సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ‘దేవదాస్’ సినిమాలోని ‘దోలా రే దోలా’, ‘తేజాబ్’లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, ‘జబ్ వీ మెట్’ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్‌కు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగులో హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ చిత్రంలో ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సరోజ్ ఖాన్ కన్నుమూడయంతో ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు గుణ‌శేఖ‌ర్‌. Also Read: ‘‘సరోజ్‌ ఖాన్ గారితో 1998లో వ‌చ్చిన‌ ‘చూడాలని ఉంది’ సినిమా కోసం పనిచేశాం. ఆ సినిమాలో రెండు పాట‌ల‌కి ఆమె కొరియోగ్రఫీ చేశారు. ముందుగా ‘ఓ మారియా.. ఓ మారియా’ పాట సరోజ్‌ ఖాన్ గారితో చేద్దామ‌నుకుంటున్నాను అని అశ్విని దత్ గారితో చెప్పగానే ఆయ‌న‌కు ఆమెతో ఉన్న అనుబంధంతో నేను వెళ్లి మాట్లాడ‌తాను అని చెప్పారు. అప్పటికే ఇండియాలోనే బిజీ కొరియోగ్రాఫ‌ర్ అయిన‌ప్పటికీ చిరంజీవి గారి సినిమా అన‌గానే ఎగ్జయిట్ అయ్యి ఒప్పుకున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు కొరియోగ్రాఫ‌ర్స్ ఎఫ‌ర్ట్‌ని త‌న డ్యాన్స్ మూమెంట్స్‌తో వంద‌రెట్లు ఎక్కువ చేస్తారు. నేను, మ‌ణిశ‌ర్మ సినీ కెరీర్ ప్రారంభించిన తొలి రోజులు అవి. పాట విన‌గానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవ‌రు అని సరోజ్‌ ఖాన్ అడిగారు. మ‌ణిశ‌ర్మ అనే అప్‌క‌మింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశారు అన‌గానే ఆ రిథ‌మ్స్ న‌చ్చి భ‌విష్యత్తులో త‌ప్పకుండా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు అని చెప్పారు. అలాగే, హైద‌రాబాద్ రాగానే తోట త‌ర‌ణి గారి సెట్‌ని బాగా లైక్ చేశారు. అది నా నాలుగో సినిమా. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌తో సినిమా అంటే అదొక అచీవ్‌మెంట్‌. దాంతో క్యాస్టింగ్‌, ఫోటోగ్రఫి, ఆర్ట్ మీద నేను పెట్టిన శ్రద్దని ఆమె మెచ్చుకొని న‌న్ను చాలా ప్రోత్సహించారు. Also Read: అలాగే, ‘ఓ మారియా.. ఓ మారియా’ పాటకు ఆమె కొరియోగ్రఫీ చేస్తోన్న విధానానికి, దానికి చిరంజీవి గారి డ్యాన్స్ స్కిల్స్‌కి యూనిట్ స‌భ్యులు షాట్ షాట్‌కి క్లాప్స్ కొట్టేవారు. మా టీమ్ అంద‌రం ఎంత ఎంజాయ్‌ చేస్తూ ఆ పాట‌ను చేశామో.. సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆ పాట‌ను ఆడియ‌న్స్ అంత‌కంటే ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ పాట‌కు ప్రభుత్వం సరోజ్‌ ఖాన్ గారికి నంది అవార్డు కూడా ఇచ్చింది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌ని ఎంత బాగా కంపోజ్ చేస్తారో ఎక్స్‌ప్రెష‌న్స్‌ని అంత బాగా క్యాప్చర్ చేస్తారు. దాంతో ‘అబ్బబ్బా ముద్దు’ సాంగ్‌కి కూడా ఆమె కొరియోగ్రఫి చేస్తే బాగుంటుంద‌ని ద‌త్తుగారితో చెప్పి ఆ పాట కూడా ఆమెతోనే చేయించాం. ఆ పాట‌లో సౌంద‌ర్య గారి ఎక్స్‌ప్రెష‌న్స్‌కి, అలాగే చిరంజీవి గారి గ్రేస్ మూమెంట్స్‌కి ప్రేక్షకులు మ‌రోసారి అంతే గొప్ప అనుభూతికి లోనైయ్యారు. ఆ పాట అప్పటికి ఒక కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికింది అని చెప్పవ‌చ్చు. ఆ ట్రెండ్ ఇప్పటికీ కొన‌సాగుతూనే ఉంది. అప్పటికే ఆమె లెజెండ‌రీ కొరియోగ్రాఫ‌ర్ అయినా కొత్తవారికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మ‌రువ‌లేనిది. ఆవిడ ఈ రోజు మ‌న‌మ‌ధ్య లేకపోవ‌డం కేవ‌లం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీకే కాదు ఇండియ‌న్ సినిమాకే లోటు. ఆవిడ ఆత్మకు శాంతిచేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను’’ అని గుణశేఖర్ అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YT4QVo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...