Monday, 27 July 2020

‘పీఎస్‌వీ గరుడవేగ’ దర్శకుడితో నాగార్జున భారీ యాక్షన్ మూవీ

‘మన్మథుడు 2’ తరవాత కాస్త గ్యాప్ తీసుకున్న కింగ్ అక్కినేని నాగార్జున.. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తున్నారు. ఇప్పటికే ఆయన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇక సోలో హీరోగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. కాగా, ఇప్పుడు మరో చిత్రాన్ని నాగార్జున ప్రకటించారు. రాజశేఖర్‌తో ‘పీఎస్‌వీ గరుడవేగ’ వంటి సూపర్ హిట్ మూవీని తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమాను అంగీకరించారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమాను ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాతలు. షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుంది. Also Read: కిందటేడాది ‘మన్మథుడు 2’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో నిరాశపరిచిన నాగార్జున.. ఈసారి మాత్రం వరుస యాక్షన్ ఎంటర్‌టైనర్లతో వస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీ రాయ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. దీంతో పాటు సాల్మన్ అనే కొత్త దర్శకుడితో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు. నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30PJIzg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...