Friday, 24 July 2020

త్వరలోనే అమితాబ్ డిశ్చార్జ్... నెగిటివ్ వార్తలపై బిగ్‌బీ సీరియస్

బాలీవుడ్ మెగాస్టార్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు.. కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం వారిద్దరూ ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు రెండువారాల ముంబైలోని నానావతి ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతున్న త్వరలో డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, బాగా కోలుకున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి,. మరో వైపు బిగ్ బి కుమారుడు కూడా డిశ్చార్జ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం మాత్రం రాలేదు. అమితాబ్ , అభిషేక్ ఉన్న వార్డులను శుభ్రపరచాల్సిందిగా సిబ్బందికి సమాచారం అందింది. దీనికి అనుగుణంగానే వారికి తుదిదశ ట్రీట్ మెంట్ అందుతోంది. అయితే ఈ క్రమంలో తనకు కోవిడ్ నెగిటివ్ వచ్చిన వార్తలు నిజం కాదని, తమకు పరీక్షలు చేశాక అది తెలుస్తుందని బిగ్ బి అన్నారు. ఇలాంటి వార్తలు ఎందుకు బయటకు వస్తున్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. అమితాబ్, అభిషేక్ డిశ్చార్జ్ కానున్నారనే వార్తలు రావడంతో అభిమానులు ఆనందంగా వున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. Read More: రేపింది. అమితాబ్ అభిషేక్‌తో పాటు ఐశ్వర్య, కూతురు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నిర్మాతల ఇంట్లో కూడా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తల్లి కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2CJRFhe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...