బాలీవుడ్ యంగ్ హీరో ఆత్మహత్య కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని సైతం విచారించారు. సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రాలని కూడా విచారించారు. తాజాగా సుశాంత్ కేసులో ప్రముఖ హీరోయిన్ కంగనాని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. సుశాంత్ మృతిపై కంగనా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. సుశాంత్ కెరియర్‌ను బాలీవుడ్‌లో ఆ నలుగురే నాశనం చేశారని కంగన ధ్వజమెత్తారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన కరణ్, ఆదిత్య చోప్రా కావాలనే సుశాంత్ కెరీర్‌ని నాశనం చేసారని ఆరోపించారు. బాలీవుడ్‌లోని కొందరు ప్రముఖుల పేర్లను బయటపడుతూ.. వారిని ‘మూవీ మాఫియా’గా అభివర్ణించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ సంచలన కామెంట్స్ చేసింది. ప్రముఖులైన కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్, జావేద్ అక్తర్‌లు ‘మూవీ మాఫియా’గా మారారని.. వీళ్లే సుశాంత్ కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించింది. సుశాంత్‌కు ఎన్నో సమస్యలు సృష్టించి.. మానసికంగా కృంగదీశారంది. వీరందరూ కూడా స్టార్ హీరోల వారసులను తప్పితే.. బయటవారిని ఇండస్ట్రీలో ఎదగనివ్వరని కంగనా విమర్శించింది Read More: అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణపై కూడా కంగనా విమర్శలు చేసింది. గతంలో కేసు విచారణ కోసం పోలీసులు కంగనాని సంప్రదించగా, ఆమె మలాలీలో ఉండడంతో ఓ బృందాన్ని పంపి స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని కోరింది. ఎలాంటి విషయాన్ని అయినా మాట్లాడేందుకు తాను భయపడనని పేర్కొంది. సుశాంత్ విషయంలో తాను చేసిన చేసిన విమర్శలని నిరూపించకపోతే పద్మశ్రీ అవార్డు కూడా తిరిగి ఇచ్చేస్తానని కూడా కంగనా సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని కంగానకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. మరి పోలీసుల విచారణలో కంగనా ఎలాంటి విషయాలు బయటపెడుతుందో వేచి చూడాలి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Ii5rK
v
No comments:
Post a Comment