Friday, 24 July 2020

ముంబై రోడ్లపై పూరి, ఛార్మి సైక్లింగ్.. షూటింగ్ షురూ అయ్యిందా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ దేవరకొండ పదో సినిమా. ‘ఫైటర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో మూడు నెలల క్రితం చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. Also Read: కాగా, షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడంలో భాగంగా ముంబైలో పరిస్థితులను పరిశీలించడానికి పూరి, ఛార్మి ఇటీవల హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. తాజాగా అక్కడ వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. ముంబైలోని జుహులో శుక్రవారం సాయంత్రం పూరి జగన్నాథ్, ఛార్మి సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి మోడరన్ సైకిళ్లపై వీరిద్దరూ షికారు చేస్తున్నారు. జుహులో లాక్‌డౌన్ నడుస్తుండటం వల్ల షాపులన్నీ మూసి ఉన్నాయి. రోడ్లు కూడా నిర్మాణుష్యంగా ఉన్నాయి. దీంతో వీళ్లిద్దరూ సైక్లింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ, వీళ్లను గుర్తుపట్టేవారు కూడా చాలా తక్కువగా ఉంటారు కాబట్టి నో టెన్షన్. ఇదిలా ఉంటే, ముంబైలో ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ చేయడం కష్టమని.. షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ఈ మధ్య వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ మొదలుపెట్టాలని పూరి ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమై కరణ్ జోహార్, విజయ్ దేవరకొండతో పూరి చర్చిస్తున్నారని కూడా అన్నారు. నిజానికి ముంబైలో నిర్మించిన సెట్‌ను తీసేసి.. మళ్లీ హైదరాబాద్‌లో నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి, కరణ్ జోహార్ దీనికి సమ్మతి తెలుపుతారో లేదో అని ఇండస్ట్రీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. రెండు, మూడు వారాల్లో దీనిపై స్పష్ట వస్తుందని అని గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పూరి, ఛార్మి ముంబైలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడే, షూటింగ్‌ను షురూ చేసే పనిలో ఉన్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2EhBiJl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...