Monday, 27 July 2020

నిజం చెప్తున్నా ఒట్టు! నాకేం తెలియదంటూ అసలు విషయం బయటపెట్టిన బండ్ల గణేష్

టాలీవుడ్ కమెడియన్, నిర్మాత ఏది మాట్లాడినా కామెడీగానే ఉంటూనే జనాల్లో సీరియస్ డిస్కషన్ అవుతుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ Vs పవర్ స్టార్ ఇష్యూ సీరియస్‌గా నడుస్తున్న సమయంలో ఓ పని చేసి షాకిచ్చారు గణేష్. నా దేవుడు అని చెప్పుకునే ఆయన.. ఆర్జీవీకి సపోర్ట్ చేసేలా 'పవర్ స్టార్' వీడియోకి లైక్ కొట్టేశారు. ఆ తర్వాత సారీ పొరపాటున జరిగిందంటూ పవన్ ఫ్యాన్స్‌కి క్షమాపణ కూడా చెప్పి జనాల చర్చను తనవైపుకు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇదే విషయమై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన బండ్ల గణేష్.. ఒట్టు నిజం చెప్తున్నా.. ట్విట్టర్ ఎలా వాడాలో పూర్తిగా తెలియకే ఆ పని చేశానంటూ వివరణ ఇచ్చారు. కారులో జర్నీ చేస్తూ ఫోన్‌లో ట్విట్టర్ చూస్తూ వెళ్తుంటే అనుకోకుండా లైక్‌పై ప్రెస్ అయిందని, ఇంతలో రోడ్డుపై ఓ వ్యక్తి ప్రమాదానికి గురికావడంతో కారు దిగి అతని వద్దకు వెళ్లానని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. Also Read: అయితే ఆ లైక్ చూసిన పవన్ ఫ్యాన్స్ తనను నిలదీశారని, అందుకే వెంటనే వారికి క్షమాపణ చెప్పానని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ఓ సారి లైక్ కొట్టాక ఎలా దాన్ని డిస్ లైక్ చేయాలో తనకు తెలియకే అలా వదిలేశానని అన్నారు. ఆ తర్వాత వేరే వ్యక్తి వచ్చి మళ్లీ లైక్ కొట్టమంటే అది డిస్ లైక్ అవుతుందని చెప్పడంతో దాన్ని డిస్ లైక్ చేశానని క్లారిటీ ఇచ్చారు బండ్ల గణేష్. ఆయన చెప్పిన ఈ సంగతి విని 'ఇకనైనా జాగ్రత్త సార్.. లేదంటే కష్టంతో పాటు నష్టం కూడా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30J0gIY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...