పవర్ స్టార్ అంటే హీరో నితిన్‌కు ఎంత అభిమానమో తెలిసిందే. పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఎన్నోసార్లు బహిరంగంగా చాటుకున్నారు. తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ చిత్రాల్లోని సీన్స్ పెట్టారు. పవన్ సినిమాలోని పాటను రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే ఒక సాధారణ ప్రేక్షకుడిలా థియేటర్‌కు వెళ్లి ఈలలు వేశారు. అంతగా అభిమానించే హీరో తన పెళ్లి వేడుకకు హాజరైతే ఆ ఆనందానికి కొలమానం ఉంటుందా? అలాంటి ఆనందంలోనే ప్రస్తుతం నితిన్ ఉన్నారు. షాలిని కందుకూరిని నితిన్ పెళ్లాడబోతోన్న విషయం తెలిసిందే. ఈనెల 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. ఇప్పటికే ప్యాలెస్‌లో పెళ్లి సందడి మొదలైపోయింది. బుధవారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకను నిర్వహించారు. నితిన్-షాలిని ఒకరికొకరు ఉంగరాలు మార్చుకున్నారు. ఇక గురువారం మెహందీ వేడుక, శుక్రవారం నితిన్‌ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమం నిర్వహించారు. Also Read: అయితే, నితిన్‌ను పెళ్లికొడుకును చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ పాల్గొన్నారు. కొత్త పెళ్లికొడుకు నితిన్‌ను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటికి వచ్చాయి. అయితే, నితిన్ స్వయంగా ఒక ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పవన్‌పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ‘‘ఈరోజు జరిగిన నా పెళ్లికొడుకు ఫంక్షన్‌కు విచ్చేసి నన్ను దీవించిన పవర్ స్టార్‌కి, త్రివిక్రమ్ గారికి, చినబాబు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నిజంగా ఇది నాకు చాలా గొప్ప విషయం’’ అని నితిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2D0oqXx
v
No comments:
Post a Comment