Thursday, 23 July 2020

‘పరాన్నజీవి’ టీజర్: వోడ్కా నా పెగ్‌లోకి రావాలి.. ఫిగరు నా..!! వాడేశారు.. బాగా వాడేశారు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా ఆయనపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీస్తోన్న చిత్రం ‘పరాన్నజీవి’. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వర్మ ‘పవర్ స్టార్’ సినిమా తీస్తున్నందుకు రివేంజ్‌గా ‘పరాన్నజీవి’ని పవర్ ఫ్యాన్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వర్మ పాత్రను షకలక శంకర్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్, కొన్ని పోస్టర్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే, కత్తి మహేష్‌ను పీకే ఫ్యాన్‌గా చూపిస్తూ వచ్చిన పోస్టర్‌పై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే, గురువారం సాయంత్రం ‘పరాన్నజీవి’ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. అటుఇటుగా ఒక నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నచ్చుతుందనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మలా షకలక శంకర్ మ్యానరిజం అదిరిపోయింది. ‘‘వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య. ‘‘లక్ష్మీ బాంబ్‌తో బాబు గారినే బదనాం చేశాను. శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్లపై శివాలెత్తేలా చేశాను. కత్తి మహేష్‌ను కత్తి దూసేలా చేశాను. స్క్రిప్ట్ నాది.. స్క్రీన్‌ప్లే నాది. ఫైటింగ్ వాళ్లది చీటింగ్ నాది. వాడుకోవడంలో వావి వరసలు లేవు. వోడ్కా నా పెగ్గులోకి రావాలి.. ఫిగరు నా పక్కలోకి రావాలి’’ అనే భారీ డైలాగుతో టీజర్‌ను నింపేశారు. Also Read: కాగా, ఈ సినిమాలో షకలక శంకర్ రాధా గోపాల్ వర్మగా కనిపించనున్నారు. ఈ సినిమాను 99 థియేటర్ బ్యానర్‌పై సీఎస్ నిర్మిస్తున్నారు. ‘బిగ్ బాస్’ ఫేమ్ డాక్టర్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ నాగేశ్ రచనా సహకారం అందించారు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ అభిమానులే. ఈ సినిమాను ఈనెల 25న ఉదయం 11 గంటలకు శ్రేయాస్ ఈటీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తున్నారు. అదే సమయానికి ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో ‘పవర్ స్టార్’ సినిమా విడుదలవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30DmtIt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...