Thursday, 23 July 2020

‘B.కామ్‌లో ఫిజిక్స్’ కొత్త పోస్టర్: RGVపై సుస్సు.. కర్మరా బాబూ..!!

ఎవ్వరినీ వదలకుండా అందరినీ కెలికే రామ్ గోపాల్ వర్మను ఈ మధ్య చాలా మంది కెలకటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఆయన సెటైరికల్‌గా సినిమా తీస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచీ తిరుగుబాటు మొదలైంది. ఇప్పటి వరకు తమలోకి దాచుకున్న కసిని చాలా మంది బయటపెట్టేస్తున్నారు. ఇప్పటికే వర్మపై ‘పరాన్నజీవి’ అనే సినిమా వస్తోంది. ఇప్పుడు మరో సినిమాలో వర్మను వాడేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘B.కామ్‌లో ఫిజిక్స్’. ‘బి.కామ్‌లో ఫిజిక్స్’.. ఈ సౌండింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ టైటిల్‌తో సినిమా వస్తోంది. ‘ఏడుచేప‌ల క‌థ’ ద‌ర్శకుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శకత్వంలో వ‌స్తున్న చిత్ర టైటిల్‌ను నిన్న (జూలై 22న) ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌ను కూడా వదిలారు. అయితే, ఈరోజు ఈ చిత్రం నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కాస్త వివాదాస్పదంగా ఉంది. టాయిలెట్స్‌లో గోడ మీద రాసున్న అనే పేరుపై ఒక అమ్మాయి మాదిరిగా ఉన్న వ్యక్తి సుస్సు పోస్తున్నాడు. Also Read: ఆ టాయిలెట్స్ గోడపై రాకేష్ మాస్టర్, టెంప్ట్ రవి, కరణ్ జోహార్, పేటీఎం, కత్తి మహేష్, కె.ఎ.పాల్ పేర్లు కూడా రాసున్నాయి. కానీ, లవ్ సింబల్‌లో RGV అని రాసి దాని మీద సుస్సు పోయిస్తున్నారు దర్శకుడు శ్యామ్. మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటో ముందు ముందు తెలియాలి. లేదంటే సినిమా వచ్చేంత వరకు ఆగాలి. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై హిందీ, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అంకిత రాజ్‌పుత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWls4D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...