Thursday, 2 July 2020

మహేష్ బాబు అరుదైన ఫీట్.. దక్షిణాది తారల్లో టాప్! రజినీకాంత్ లాంటి హీరోని వెనక్కినెట్టి..

టెక్నాలజీ విస్తృతమవడం, ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో ఈ ప్రపంచమంతా అరచేతిలో ఇమిడిపోయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో సెలబ్రిటీలు పోటీ పడుతూ నెట్టింట యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ తమ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. దీంతో హీరోహీరోయిన్ల సోషల్ మీడియా ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతోంది. అయితే తాజాగా ట్విట్టర్ ఫాలోవర్స్ పరంగా అరుదైన ఫీట్ సాధించి దక్షిణాది తారల్లో టాప్ స్టార్‌గా నిలిచారు సూపర్ స్టార్ . ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ, సినిమా విశేషాలే కాకుండా సామజిక అంశాలపై కూడా మహేష్ బాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలో ఆయనను సినీ అభిమానులే కాకుండా సాధారణ నెటిజన్స్ కూడా ఫాలోవర్స్‌గా మారిపోయారు. దీంతో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లు (కోటి) దాటింది. Also Read: దీంతో దక్షిణాది సినీ తారల్లో కోటి మంది ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన వ్యక్తిగా మహేష్ పేరిట రికార్డు నమోదైంది. దక్షిణాది సినీ తారల పరంగా మహేష్ తర్వాత కమల్ హాసన్ 6.1 మిలియన్లు, రజనీకాంత్ 5.7 మిలియన్లు, అల్లు అర్జున్ 4.7 మిలియన్లు, జూనియర్ ఎన్టీఆర్‌ 4.2 మిలియన్ల ఫాలోవర్స్‌తో కొనసాగుతున్నారు. మరోవైపు కెరీర్ పరంగాను దూకుడుగా వెళ్తున్నారు మహేష్ బాబు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dTrOjJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...