బాలీవుడ్ యువ హీరో ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. సుశాంత్ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో నెపోటిజంపై విమర్శల వెల్లువెత్తున్నాయి. మానసిక ఒత్తిడి కారణంగా జూన్ 14వ తేదీన సుశాంత్ ముంబైలోని బాంద్రాలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుశాంత్ మరణంతో సినీ ప్రముఖులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన ఫ్యాన్స్‌తో పాటు తోటి నటల్ని సైతం సుశాంత్ మరణం తీవ్రంగా కలిచివేసింది. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అనేకమందిని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మరణంపై ప్రముఖ హిందీ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రశ్నించనున్నారు . ఈయనతో పాటు ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను కూడా ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. షాను శర్మ యష్ రాజ్ ఫిల్మ్స్‌కు పనిచేస్తుంటాడు. కంగనా రనౌత్, శేఖర్ కపూర్‌లు కూడా స్టేట్మెంట్లు ఇవ్వడానికి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విషయంలో ఆమె ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు.. సుశాంత్ చివరి సినిమా హీరోయిన్ సంజన సంఘిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఇక సుశాంత్ మరణంపై తాజాగా శేఖర్ సుమన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నెలకు 50 సార్లు సిమ్ కార్డులను మార్చాడు, ఆయన ప్లాట్ డూప్లికేట్ తాళాలు ఉండాల్సిన ప్లేస్‌లో లేవని ఆరోపించారు. ఇలా కొన్ని లింక్‌లను ఉటంకిస్తూ సిబిఐ దర్యాప్తును డిమాండ్ చేశాడు. 'జస్టిస్ ఫర్ సుశాంత్' అనే ఫోరం ప్రారంభించిన సుమన్ మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యలో "కంటికి కనిపించని విషయాలు చాలా ఉన్నాయని పేర్కొన్నాడు. ఆయన ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eTAJCZ
v
No comments:
Post a Comment