Monday, 27 July 2020

సెక్సీ పోజిచ్చిన సమంత.. అన్నీ ఒక్కదాంట్లోనే! అందాలతో అక్కినేని కోడలి హాట్ ట్రీట్

టాలీవుడ్‌లో అక్కినేని కోడలు హవా కొనసాగుతోంది. పెళ్లి తర్వాత వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్. అదొక్కటే కాదు తన అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటూ , ధ్యానం లాంటివి చేస్తుంటుంది సామ్. ఆరోగ్యంగా ఉంటేనే అందం అంటూ సమంతతో పాటు పలువురు హీరోయిన్స్ ఇదే బాట పట్టారు. ఈ క్రమంలోనే తాజాగా యోగా, ధ్యానం లాంటివి చేస్తూ తమ జీవితాన్ని అందంగా మలచుకుంటున్న వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై మంచు లక్ష్మి, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లను తమ తమ పిక్స్ షేర్ చేయాలంటూ ట్యాగ్ చేసింది. ఈ పోస్ట్ చూసిన సమంత వెంటనే స్పందిస్తూ తన లేటెస్ట్ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో మోడ్రన్ దుస్తులు సెక్సీ పోజిస్తూ కనిపిస్తున్న సామ్.. బ్లాక్ అండ్ వైట్‌ లుక్‌లో మాయ చేసింది. ఈ ఫోటోపై ''ఛాలెంజ్ స్వీకరిస్తున్నా.. డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్.. అన్నీ ఒక్కదాంట్లోనే'' అని కామెంట్ చేసింది. దీంతో క్షణాల్లో ఈ పిక్ వైరల్ కావడం, లైకుల వర్షం కురవడం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు ఈ పిక్‌కి 10 లక్షలకు పైగా లైక్స్ రావడం విశేషం. Also Read: మరోవైపు సమంత తన ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని అమాంతం పెంచుకొని ఇటీవలే అరుదైన మైలురాయిని దాటేసింది. ఎప్పటికప్పుడు అక్కినేని కుటుంబ విషయాలు, నాగచైతన్యతో వెకేషన్ టూర్ ఫొటోస్ పంచుకుంటూ అభిమానులతో లైవ్ చాట్ చేస్తుండే సమంత ఇన్స్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్ల మార్క్ దాటింది. ప్రస్తుతం ఆమె 'ఫ్యామిలీ‌మేన్-2' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f4Qh66
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...