Friday, 3 July 2020

నిహారిక నిశ్చితార్థం డేట్, ప్లేస్ ఫిక్స్.! కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం?

మెగా డాటర్ కొణిదల.. ‘అతడు నావాడే’ అని దాగుడు మూతలు ఆడుతూ.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసిందో అప్పటి నుంచి ఆమె పెళ్లి వార్త వైరల్‌గా మారింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. చైతన్య స్వస్థలం గుంటూరు కాగా.. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. చైతన్య.. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో ఉన్నట్టు సమాచారం. ఇక చైతన్య-నిహారికలకు ముందే పరిచయం ఉండటంతో ఒకర్నొకరు అర్థం చేసుకుని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే నిహారిక- చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో, అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని వార్తలు రాగా.. త్వరలోనే నిశ్చితార్థం ఉంటుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నాం అంటూ చెప్పిన నాగబాబు.. పెళ్లిని ఇలాంటి పరిస్థితుల్లో అట్టహాసంగా చేయడం కుదరదని చెప్పకనే చెప్పారు. అయితే నిహారిక- చైతన్యల నిశ్చితార్థం ఆగష్టు 13న జరిగే అవకాశం ఉందని మెగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ వేడుకను గుంటూరులో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక నిశ్చితార్థంతో పాటు పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా చేయడానికి చూస్తున్నారట మెగా ఫ్యామిలీ. పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని భావించినా.. ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర కారణాలతో మెడా డాటర్ పెళ్లి, నిశ్చితార్థం సింపుల్‌గా చేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారట రెండు కుటుంబాల పెద్దలు. అయితే పబ్లిక్ పండుగ కాదన్న నాగబాబు ఈ పెళ్లిపనుల్ని రహస్యంగానే ఉంచుతున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VLEPWh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...