బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. నిన్నమొన్నటివరకు తమతో సరదాగా గడిపే నటుడు, తమ తోటి స్నేహితుడు లేడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన మిత్రులు, అభిమానులు, తోటి నటులు తేరుకోలేని షాక్‌కు గురయ్యారు. సుశాంత్‌తో కలిసి పనిచేసిన హీరోయిన్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆయన ఆత్మహత్య ను నమ్మలేకపోతున్నామని సుశాంత్ లేని లోటు తీరదని భావోద్వేగంతో పోస్ట్ లు పెడుతున్నారు. సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బేచారా' లో నటించిన హీరోయిన్ సంజనా సాంఘి. సుశాంత్ ఆత్మహత్యతో ఆమె తీవ్ర బావోద్వేగంలో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇనస్టాగ్రామ్ ఖాతాలో... "బై ముంబై. నేను ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతున్నాను. ఇక్కడి వీధులన్నీ వింతగా, కొత్తగా కనిపిస్తున్నాయి. నా గుండెల్లో నిండుకున్న బాధ కారణంతో నా చూపు కూడా మారిందేమో... వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కాకుంటే నీలో కూడా ఏదైనా బాధ ఉందేమో. త్వరలోనే మళ్లీ కలుస్తాం. లేకుంటే కలవలేకపోవచ్చు కూడా" అంటూ పోస్ట్ చేసింది. ఆమె మొదటిసారి హీరోయిన్ గా నటించిన చిత్రం 'దిల్ బేచారా' ఓటిటి లో విడుదలవడం, సుశాంత్ మరణం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తోంది. సంజన సంఘి తొలిసారిగా రణబీర్ కపూర్ రాక్ స్టార్ సినిమాలో నటించింది. సంజన పుట్టి పెరిగింది ఢిల్లీలోనే. సంజన తండ్రి సందీప్ సంఘి వ్యాపార వేత్త.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VCRcUh
v
No comments:
Post a Comment