Friday, 5 June 2020

Vaishnav Tej: విజయంపై ధీమాగా ‘ఉప్పెన’.. కలిసి వచ్చిన రన్ టైం

‘ఉప్పెన’ ఫస్ట్ లుక్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు మెగా హీరో వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్టవ్‌ తేజ్‌ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్ క్రితి శెట్టి కూడా ఫ్రెష్ లుక్‌‌కి చాలా మంది యూత్ ఫిదా అయిపోతుండటంతో ‘ఉప్పెన’ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు చాలామంది. అయితే ఈ చిత్రం విజయం పట్ల ధీమాగా ఉన్న నిర్మాతలు.. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా.. థియేటర్స్ ఓపెన్ చేస్తే తొలివారంలోనే ‘ఉప్పెన’ చిత్రాన్ని రిలీజ్ చేసి.. ఉప్పెన లాంటి కలెక్షన్లు రాబట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్‌ని పూర్తి చేశారట సీనియర్ ఎడిటర్ నవీన్ నూలి. 2.30 గంటల నిడివితో రన్ టైం ఇచ్చారట. త‌మిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్‌ ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. నీ కళ్లు నీలి సముద్రం అనే పాట సంగీతం ప్రపంచంలో ‘ఉప్పెన’లా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాటతో పాటు ధక్ ధక్ ధక్ ధక్ అనే పాట సైతం శ్రోతల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ కాగా.. 2.30 గంటల రన్ టైం కూడా ప్లస్ కాబోతుందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎడిటింగ్ వర్క్ పూర్తి కావడంతో విజయంపై ధీమాతో చిరంజీవికి ఈ సినిమాను చూపించబోతున్నారు నిర్మాతలు. అనంతరం వెండితెరపై ఉప్పెనలా రాబోతున్నాడు మెగా హీరో.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f5Ziwj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...