Friday, 5 June 2020

Forbes 2020 List: దేశంలోనే నెంబర్ 1 హీరో.. మళ్లీ దంచికొట్టిన ఖిలాడీ

ఫోర్బ్స్ వార్షిక జాబితాలో అత్యధిక పారితోషికం పొందిన 100 మంది ప్రముఖుల్లో భారత్‌ నుంచి బాలీవుడ్‌ హీరో మాత్రమే చోటుదక్కింది. ప్రముఖ గ్లోబల్ మీడియా కంపెనీ ఫోర్బ్స్ వరల్డ్స్ హయ్యస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించగా.. ఇందులో ఇండియా నుంచి కేవలం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒక్కడే చోటు దక్కించుకున్నారు. రూ. 366 కోట్ల వార్షిక ఆదాయంతో అక్షయ్‌ కుమార్‌కు 52వ స్దానం లభించింది. జూన్‌ 2019 నుంచి మే 2020 వరకూ అక్షయ్ కుమార్ ఆదాయం లెక్కించగా.. రూ.366 కోట్లతో అత్యంత రాబడి కలిగిన టాప్‌ 100 సెలబ్రిటీల సరసన చేరారు. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అక్షయ్ కుమార్ ఆదారం తగ్గింది. గత ఏడాది అక్షయ్ కుమార్ రాబడి రూ. 490 కోట్లు కాగా.. ఈ ఏడాది రూ.366 కోట్లు మాత్రమే. ఈలెక్కన గత ఏడాది కంటే రూ.124 కోట్లు తక్కువ. హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న అక్షయ్.. రీసెంట్‌గా ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు అక్షయ్ కుమార్. కరోనా ఎఫెక్ట్ సెలబ్రిటీల రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో గత ఏడాదికి ఈ ఏడాదికి లెక్కల్లో భారీగా తేడాలు వచ్చాయి. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన కైలీ జెన్నర్ రూ. 4453 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్‌ మెస్పీ, టేలర్‌ పెర్రీ, నేమార్‌, హోవర్డ్‌ స్టెమ్‌ తరువాతి స్థానాల్లో ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dCXxGt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...