దేశంలోని అన్ని రంగాలను కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసేసింది. ఆర్ధికంగా ప్రతీ ఒక్క రంగంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమా రంగంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. ఎక్కడిక్కక్కడ షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్స్ మూతపడటంతో సినీ రంగంలోని బడా నిర్మాతలు మొదలుకొని కార్మికుల వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ దర్శకధీరుడు ఓ సెన్సేషనల్ డిసీజన్ తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగు చిత్రసీమలో భారీ బడ్జెట్ సినిమాలకు బీజం వేసిన రాజమౌళి.. ఈ కల్లోల పరిస్థితుల్లో తన లేటెస్ట్ మూవీ బడ్జెట్ తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో భారీ సినిమాలు రూపొందించి అంతకు రెండింతలు లాభాలు తీసుకొచ్చినప్పటికీ ఇలాంటి పరిస్థితుల నడుమ నిర్మాతలను సేవ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తన RRR బడ్జెట్ కోతపై దృష్టి పెట్టారట. ఇందులో భాగంగా ప్రొడక్షన్ బడ్జెట్‌లో ఎలాంటి మార్పు లేకుండా నటీనటుల రెమ్మ్యూనరేషన్ పరంగా కాస్త కొత్త పెట్టాలని చూస్తున్నారట. ఇలా అయితేనే ఔట్‌పుట్‌పై ప్రభావం పడదని, బడ్జెట్ కోతలో రెమ్మ్యూనరేషన్ తగ్గించుకోవడమే ముఖ్య సూత్రమని ఆయన తన యూనిట్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. Also Read: డీవీవీ దానయ్య నిర్మాణంలో RRR సినిమా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది. ఇప్పటికే మజార్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే మిగిలిన భాగం షూట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h1pSbF
v
No comments:
Post a Comment