Friday, 26 June 2020

MURDER: అమృత బిడ్డను చూపిస్తూ మరో పోస్టర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించిన వర్మ

ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ సంచలనాలు క్రియేట్ చేసే .. ఈ సారి అమృత, మారుతీ రావుల విషాద గాదపై కన్నేసిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్త సంచలనం సృష్టించిన మారుతీరావు- అమృత రియల్ స్టోరీని తీసుకొని దానిని కెమెరాలో బంధిస్తున్నారు వర్మ. ఇటీవల ఫాథర్స్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో మరోసారి ఈ అంశం జనాల్లో పలు చర్చలకు తెరలేపింది. ఈ మూవీకి అనే టైటిల్ ఫిక్స్ చేసి 'కుటుంబ కథా చిత్రమ్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన సమర్పణలోనే వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటిదాకా విడుదల చేసిన పోస్టర్స్ ఓ ఎత్తయితే.. తాజాగా విడుదల చేసిన పోస్టర్ మరో ఎత్తయింది. Also Read: కిరాయి హంతకుల చేతిలో ప్రయణ్ చనిపోయిన తర్వాత అమృతకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌లో ఆ బిడ్డను చూపిస్తూ ఆ దీన గాధను మరోసారి గుర్తుచేశారు వర్మ. తన ట్విట్టర్ వేదికగా ఈ పోస్టర్ షేర్ చేసిన వర్మ.. అమృత పాత్ర పోషించిన నటి ఆవంచ సాహితి పండించిన ఎమోషన్‌కి ఫిదా అయ్యానని పేర్కొన్నారు. ప్రణయ్ పరువు హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అమృత తండ్రి ఆత్మహత్య తదితర అంశాలను ఫోకస్ చేస్తూ ఈ మూవీ రూపొందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dEBTR7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...