Friday, 26 June 2020

దాసరి కుటుంబంలో ఆస్తి తగాదాలు... గేటు దూకి ప్రభు ఇంట్లోకి అరుణ్ కుమార్

ప్రముఖ దివంగత దర్శకుడు, నిర్మాత కుటుంబంలో ఆస్తి తగాదాలు తెరపైకి వచ్చాయి. పెద్ద కుమారుడు ప్రభు ఇంట్లోకి... చిన్న కుమారుడు అరుణ్ కుమార్ జూన్ 24న రాత్రి గేటు దూకి అక్రమంగా ప్రవేశించారు. గేటుకు తాళం వేసి ఉండగా... దూకి..ఇంట్లోకి వచ్చి తతన భార్యను, మామయ్యను తనను దుర్భాషలాడినట్లు ప్రభు ఆరోపిస్తున్నారు. దీనిపై జూబ్లీ హిల్స్ పోలీసులను కూడా ప్రభు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల ఎదుట కూడా అరుణ్, అతని భార్య సునీత కూడా తన కటుంబాన్ని నోటికొచ్చనట్లు మాటలాడారన్నారు ప్రభు. జూన్ 24న రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో ఇంట్లోకి గేటు మీద నుంచి దూకి అరుణ్ కుమార్ వచ్చినట్లు మీడియా ఎదుట ప్రభు తెలిపారు. రాత్రి ఫూటుగా తాగి వచ్చి తన భార్యపై చేయి కూడా చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. మధ్యలో వచ్చిన తన మామయ్యను కూడా నానా మాటలు అన్నారన్నారు. పైన గదిలోకి వెళ్లి బీరువా కూడా తెరిచేందుకు ప్రయత్నించాడని చెబుతున్నారు. తర్వాత భార్య సునీతకు కాల్ చేసిన అక్కడకు రమ్మని పిలిచాడన్నారు. ఆమె తన సోదరుడితో కలిసి తన ఇంటికి వచ్చిందన్నారు ప్రభు. ఆమె కూడా పోలీసుల ఎదుట తను చేయి చూపిస్తూ తిట్టిందని ఆరోపిస్తున్నారు ప్రభు. తన కుటుంబానికి చెందిన ఆస్తి వివాదంపై మోహన్ బాబు, కల్యాణ్, మురళి మోహన్ వంటి పెద్దలు స్పందించాలని ప్రభు కోరుతున్నారు. చాలామంది పెద్దల్ని కలిసినా తన సమస్య తీరలేదన్నారు. తాను ఉంటున్న ఇల్లు తన తండ్రి దాసరి మనవరాలి పేరు మీద రాసి ఇచ్చారన్నారు. తన కూతురు పేరు మీదున్న ఇంటిలోనే తాను ఉంటున్నానన్నారు. విల్లు ప్రకారమే తాను ఆ ఇంటిలో ఉంటున్నట్లుగా తెలిపారు. కోర్టులో దీనిపై కేసు కూడా నడుస్తోందన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/381657Y
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...