Thursday, 25 June 2020

Katrina Kaif: ఆ హీరోది డిఫరెంట్ క్యారెక్టర్.. వార్నింగ్ ఇచ్చా: సీక్రెట్స్ చెప్పేసిన స్టార్ హీరోయిన్

రంగుల ప్రపంచంలో సినీ తారల లవ్, డేటింగ్, బ్రేకప్ సంగతులు ఎన్నెన్నో ఉంటాయి. డేటింగ్ చేయడం, చెట్టాపట్టాలేసుకొని విదేశాలు చుట్టిరావడం, ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకోవడం వాళ్లకు కామనే అయినా వారి అభిమానులకు మాత్రం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ మ్యాటర్స్ మరీ ఎక్కువ. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలి అనుకోని రీతిలో విడిపోయిన హీరోహీరోయిన్లను చాలామందినే చూశాం. బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ కూడా ఆ లిస్టులో ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌తో కత్రినా నడిపిన ప్రేమాయణం, ఆ సంగతులు అందరికీ తెలిసినవే. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పిన కత్రినా.. తాజా ఇంటర్వ్యూలో రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి చెబుతూ బ్రేకప్ కొన్ని రహస్యాలు వెల్లడించింది. అతని నుంచి విడిపోవడమే మంచిదయ్యిందని, తనకు అదొక ఆశీర్వాదం లాంటిదని అంటూ షాకింగ్ సంగతులు చెప్పుకొచ్చింది. Also Read: రణ్‌బీర్‌ క్యారెక్టర్ చాలా చాలా డిఫరెంట్ అని కత్రినా తెలిపింది. అతనితో వేగడం చాలా కష్టమైన పని అని, ఆ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. దీంతో తానే స్వయంగా అతనికి బ్రేకప్ చెప్పి ఆ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేశానని తెలిపింది. ఈ మేరకు బ్రేకప్ మూమెంట్ కూడా వివరించింది కత్రినా. ఓ రోజు జిమ్‌లో తెగించేసి రణ్‌బీర్‌కి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బ్రేకప్ కూడా చెప్పేశానని చెప్పిన కత్రినా.. అప్పటి నుంచి ప్రేమ, డేటింగ్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని చెప్పడం విశేషం. ఇకపోతే కత్రినాతో కటీఫ్ చేసుకున్న రణ్‌బీర్ ప్రస్తుతం మరో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తుండటం గమనార్హం. చూడాలి మరి రణ్‌బీర్- ఆలియా జంట అయినా పెళ్లి పీటలెక్కుతారా? లేదా సడెన్ షాక్ ఇస్తారా? అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2BHGgO2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...