Sunday, 7 June 2020

Crrush: బాత్‌రూమ్‌లో అమ్మాయి.. మాస్క్ తప్పనిసరి అంటూ కిక్కిచ్చిన రవిబాబు

విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు అని చెప్పుకోవచ్చు. కెరీర్ ఆరంభం నుంచే డిఫరెంట్ రూట్‌లో వెళ్తూ పలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ పరిచయం చేసిన ఆయన.. ఇటీవలే 'ఆవిరి' సినిమాతో అలరించారు. ఇక ఇప్పుడు '' అంటూ మరో సినిమా రెడీ చేస్తున్నారు. హారర్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా రూపొందించే రవిబాబు ఈ సారి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేశారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 'క్రష్' అంటూ యూత్‌కి కనెక్ట్ అయ్యే టైటిల్ చూసే చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా అన్‌లాక్ 1.0 అని పేర్కొంటూ ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు రవిబాబు. రవిబాబు స్టైల్ లోనే ఈ పోస్టర్ వినూత్నంగా ఉండటమే గాక యువతను ఇట్టే ఆకర్షిస్తోంది. Also Read: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తూ కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకుంటున్న అమ్మాయిని, డోర్ పక్కనే ఉండి మాస్క్ ధరించి అదంతా చూస్తున్న ముగ్గురు అబ్బాయిలను ఈ పోస్టర్‌లో చూపించడం ఆసక్తికరంగా ఉంది. పైగా ఈ పోస్టర్‌పై ''జాగ్రత్తగా బయట పడండి'' అని పేర్కొనడం యువతరానికి స్పెషల్ కిక్కిస్తోంది. 'మాస్క్ పెట్టుకోండి సేఫ్‌గా ఉండండి' అని పేర్కొంటూ ప్రస్తుత పరిణామాలను ఇంక్లూడ్ చేసి ఈ పోస్టర్ వదిలారు రవిబాబు. దీంతో ప్రస్తుతం ఈ 'క్రష్' పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3h6Ijvh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...