ప్రతీ వ్యక్తికి మనసుకు నచ్చిన మరోవ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఓ వ్యక్తి తన స్టైల్, టాలెంట్, మనస్తత్వం, ఫిగర్ ఇలా పలు అంశాలతో మరో వ్యక్తిని బాగా అట్రాక్ట్ చేస్తుంటాడు. కేవలం సాధారణ ప్రజలకే కాదు సెలబ్రిటీలకు సైతం ఇలా ఫేవరెట్ వ్యక్తులు ఉంటారు. ఓ హీరోకు హీరోయిన్ అంటే ఇష్టం, అదేవిధంగా ఓ హీరోయిన్‌కి హీరో అంటే ఇష్టం లాంటివి కామన్. అయితే కొన్ని సందర్భాల్లో తాము ఇష్టపడే వ్యక్తి పెళ్లి చేసుకొని వెళ్లడం మాత్రం కాస్త బాధ పెడుతుంది. ఇలాంటి సందర్భమే తన జీవితంలోనూ ఉందంటున్నారు . తన పెళ్లి సమయంలో చాలా మంది అమ్మాయిలు బాధపడుతూ మెసేజీలు, మెయిల్స్ పంపారని, అయితే అభిమాన తారలకు పెళ్లి జరిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందనేది తనకు తెలుసంటూ ఓపెన్ అయ్యారు బన్నీ. తన ఫేవరేట్ ఫిక్స్ అయినప్పుడు తాను కూడా ఇలాగే చాలా బాధపడ్డానని అన్నారు. 2007 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. బన్నీ చెప్పిన ఈ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. Also Read: ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో భారీ హిట్ రాబట్టిన ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న ఈ సినిమాను గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశాన్ని తీసుకొని ఆసక్తికరంగా మలుస్తున్నారు సుక్కు. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37gUBgf
v
No comments:
Post a Comment