Tuesday, 2 June 2020

ఫేమస్ పార్క్‌లో బన్నీ వాకింగ్.. వీడియో వైరల్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉన్న కేబీఆర్ పార్క్ చాలా ఫేమస్. నగరం నడిబొడ్డులో ఉన్న నేషనల్ పార్క్ ఇది. సుమారు 390 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్‌కు సినిమా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, మోడల్స్, రాజకీయ నాయకులు నిత్యం సందర్శిస్తూనే ఉంటారు. ప్రతి రోజూ ఉదయం చాలా మంది ప్రముఖులు ఇక్కడ జాగింగ్, వాకింగ్ చేస్తుంటారు. అయితే, తాజాగా స్టైలిష్ స్టార్ కేబీఆర్ పార్క్‌లో జాగింగ్ చేశారు. షార్ట్స్, టీస్ వేసుకుని చాలా సీరియస్‌గా వాకింగ్ చేసేస్తున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా సీరియస్‌గా వాకింగ్ చేస్తున్న బన్నీని కొంత మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్‌కు రక్షణగా ఒక బౌన్సర్ కూడా ఉన్నారు. వీడియోలు తీయొద్దంటూ అక్కడున్న ఉత్సాహపరులకు ఆ బౌన్సర్ సైగ చేస్తున్నట్టు వీడియోలో స్పష్టమవుతోంది. Video: ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. బన్నీ సింప్లిసిటీ అంటూ కొనియాడుతున్నారు. అయితే, బన్నీ కేబీఆర్ పార్క్‌కు డైలీ వస్తారా? లేదా అప్పుడప్పుడు వస్తారా? అనే విషయంలో స్పష్టత లేదు. ఈ వీడియోలో బన్నీ ఉంగరాల జుట్టు, కాస్త గెడ్డంతో కనిపిస్తున్నారు. ‘పుష్ప’ సినిమా కోసం ఆయన ఈ విధంగా తయారయ్యారు. ఈ పాన్ ఇండియా సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం అల్లు అర్జున్ తన బాడీ షేప్‌ను కూడా మార్చుకున్నారు. కాగా, ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ.. ఇప్పుడు ‘పుష్ప’తో సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ‘రంగస్థలం’ మాదిరిగా ఈ సినిమాను కూడా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XW1cZ5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...