Tuesday, 2 June 2020

ప్రముఖ సిమెంట్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ‘గ‌ద్దల‌కొండ గ‌ణేష్’ సినిమా కిందటేడాది బాక్సాఫీస్ ద‌గ్గర మంచి వ‌సూళ్లను రాబట్టింది. ఇక వ‌రుణ్ తేజ్ బ్రాండ్స్, అండోర్స్‌మెంట్స్ ఫీల్డ్‌లో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప‌లు దేశీయ బ్రాండ్లకి అండోర్స్ చేస్తున్న వ‌రుణ్ తేజ్ తాజాగా ప్రముఖ సిమెంట్ బ్రాండ్ నాగార్జున సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు అంగీక‌రించారు. తమ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న పోస్టర్లను నాగార్జున సిమెంట్స్ యాజమాన్యం అధికారికంగా విడుద‌ల చేసింది. నాగార్జున సిమెంట్స్‌కి సంబంధించిన పాపుల‌ర్ ట్యాగ్ లైన్స్ (మీ అనుంబంధ‌మే మా బ‌లం, ప్రతి సౌధంలో మొన‌గాడై నిలిచి)తో ఈ పోస్టర్స్‌ని తయారుచేశారు. ఈ అడ్వర్టైజింగ్ పోస్టర్లలో వరుణ్ లుక్ కూడా అదిరిపోయింది. ఆయన హెయిర్ కట్, గుబురు గెడ్డం చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ లుక్ ‘బాక్సర్’ (ఇంకా టైటిల్ ఖరారు కాలేదు) సినిమా కోసం అని తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం త‌న కొత్త సినిమా కోసం బాక్సింగ్‌లో స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ‘బాక్సింగ్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారు. వరుణ్ తేజ్‌కు ఇది 10వ సినిమా. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zTPjuT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...