Sunday, 7 June 2020

దుమ్ముదులుపుతోన్న ‘క్లైమాక్స్’: వెల్‌కమ్ మియా.. బైబై కరోనా అంటోన్న వర్మ

డైరెక్టర్ ఏం చేసినా సెన్సేషనే. సినిమా ఫలితం ఎలా ఉన్న దాని ప్రమోషన్‌తో పిచ్చెక్కించేస్తారాయన. రకరకాల ప్రమోషన్ టిప్స్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటారు. టీజర్లు, ట్రైలర్లు, తన వింత ప్రచారంతో మంచి హైప్ తీసుకొస్తారు. ఇప్పుడు ‘క్లైమాక్స్’ విషయంలో కూడా అదే జరిగింది. ఈ లాక్‌డౌన్ సమయంలో థియేటర్లు మూసేయడంతో బోర్ ఫీలవుతోన్న ఆడియన్స్‌ను ఆయన టార్గెట్ చేశారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ఒక షార్ట్ వెబ్ ఫిల్మ్ తీశారు. మంచి మసాలా జోడించి థ్రిల్లర్ జోనర్‌లో ఈ లఘు చిత్రాన్ని తీశారు. Also Read: ట్రైలర్లలోని మియా మాల్కోవా హాట్‌నెస్ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ సినిమాను శనివారం రాత్రి 9 గంటలకు ‘ఆర్జీవీవరల్డ్’ అనే తన సొంత వెబ్‌సైట్‌లో వర్మ విడుదల చేశారు. ఈ సినిమా చూడాలంటే రూ.100 చెల్లించాలి. అయితే, ఈ సినిమాకు 12 గంటల్లోనే అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా 1,68,596 మంది ఈ సినిమాను చూశారు. ఈ స్పందన చూసి వర్మకే కళ్లు తిరిగాయి. ఓ 50 వేల మంది చూస్తారని అంచనా వేశారట. కానీ, ఊహించని స్థాయిలో దుమ్ముదులిపేసింది మియా. సర్వర్ కూడా క్రాష్ అయ్యింది. Also Read: తన సినిమాకు ఈ స్థాయిలో స్పందన రావడం పట్ల వర్మ ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘క్లైమాక్స్’ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. ‘‘థియేటర్స్‌ను మూసివేసిన కరోనాను పక్కకు దొబ్బేశారు. నా సొంత ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌ను ప్రతి ఒక్కరి ఇంటిలో నిర్మించుకున్నారు. ఒక్కరోజు కూడా పూర్తికాకుండా 1,68,596 మంది రూ.100 చెల్లించి ‘క్లైమాక్స్’ను చూశారు. వెల్‌కమ్ మియా మాల్కోవా.. బై బై కరోనా. ఆర్జీవీ క్లైమాక్స్ ది గేమ్ ఛేంజర్’’ అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మొత్తానికి ఈ లాక్‌డౌన్ సమయంలో మియా మాల్కోవా వర్మకు బాగానే డబ్బులు చేసి పెడుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eVy7Ef
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...