Monday, 1 June 2020

ఆర్థిక ఇబ్బందులపై స్పందించిన సీనియర్ నటి రాశి

శ్రీకాంత్, పవన్ కళ్యాణ్, జగపతి బాబు వంటి హీరోలతో నటించి ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది అందాల రాశి. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన ఆ తర్వాత అగ్ర నటి స్థాయికి చేరుకున్నారు. బాలనటిగా ‘రావుగారిల్లు’అనే సినిమా ద్వారా ప్రేక్షకులకు రాశి పరిచయం అయ్యారు. రాశి అసలు పేరు విజయలక్ష్మీ. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన గోకులంలో సీత, జగపతిబాబు హీరోగా వచ్చిన శుభాకాంక్షలు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇక తమిళంలో మంత్ర అనే పేరుతో నటించింది. శీను,సముద్రం,వెంకీ వంటి చిత్రాలలో రాశి ఐటెం సాంగ్స్ కూడా చేశారు. నిజం అనే మహేష్ బాబు సినిమాలో విలన్‌గా చేసిన గోపిచంద్‌కు వ్యాంప్ క్యారెక్టర్‌లో కూడా రాశి నటించారు. పెళ్లి చేసుకుని ఫ్యామిలీకి పరిమితమైపోయిన రాశి ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. తల్లి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. మరోవైపు, రాశి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినీ అవకాశాలు లేక బాధ పడుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రాశి స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె మాట్లాడుతూ... ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని స్పష్టం చేశారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నానని చెప్పారు. సమస్యలు ఎవరికైనా వస్తుంటాయని... వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలని అన్నారు రాశి. చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా, అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి ఆ తర్వాత సినిమాల్లో మాత్రం కనుమరుగయ్యారు. ఇప్పుడు రాశి మరసారి రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TWXGwE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...