కాలం మారింది. రోజులు గడుతున్నా కొద్దీ టాలీవుడ్ ఇండస్ట్రీ బలపడుతూ వస్తోంది. దీంతో సీన్ రివర్స్ అయి మన తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసే పరిస్థితులు వచ్చేశాయి. తెలుగు సినిమా సత్తా ఏంటనేది ఉత్తరాదికి తెలిసిపోవడంతో ఇక్కడి సినిమాలను రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు హిందీ దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ '' సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ బడా నిర్మాత పెద్ద మొత్తం వెచ్చించారని టాక్. తెలుగులో అల్లు అర్జున్- పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిన 'అల.. వైకుంఠపురములో' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. థమన్ కట్టిన బాణీలు ఎల్లలు దాటి భాషాభేదం లేకుండా శ్రోతలను అలరించాయి. దీంతో ఈ మూవీ హిందీ రీమేక్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టారట బాలీవుడ్ బడా నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ మొదలుకొని నటీనటుల ఎంపిక వరకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ సెలక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టారట. Also Read: లేటెస్ట్ సమాచారం మేరకు 'అల.. వైకుంఠపురములో' హిందీ రీమేక్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనతో సంప్రదింపుల కార్యక్రమం కూడా ఫినిష్ అయిందని టాక్. ముందుగా ఈ రీమేక్ కోసం సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ పేర్లను పరిగణలోకి తీసుకున్న ఆ నిర్మాత చివరకు వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ వేట కూడా మొదలు పెట్టారట. అతిత్వరలో ఈ మూవీపై అఫీషియల్ ప్రకటన రానుందని బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36VeGIZ
v
No comments:
Post a Comment