Friday, 5 June 2020

'A' టీజర్ రిలీజ్.. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ సస్పెన్స్ థ్రిల్లర్.. కథ మొత్తం ఆమె చుట్టే!!

తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాలకు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. బాడా స్టార్స్ సైతం చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుండటం శుభపరిణామంగా మారింది. దీంతో నూతన నటీనటులు, దర్శకులు తమలోని టాలెంట్ చూపించేందుకు మంచి అవకాశం లభిస్తోంది. ఈ క్రమంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “A”() తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు దర్శకుడు యుగంధర్ ముని. నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం చేస్తూ “A” మూవీ రూపొందించాడు. ఈ చిత్రం నుంచి వస్తున్న అన్ని అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నటుడు జగపతి బాబు చేతుల మీదుగా విడుదలైన “A” మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందగా.. తాజాగా సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కేవలం 55 సెకనుల నిడివితోతే ఈ టీజర్ కట్ చేసి ప్రేక్షకలోకాన్ని థ్రిల్ చేశారు మేకర్స్. సౌండ్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రక్షన్‌గా నిలుస్తున్నాయి. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే కథ అంతా చిన్నారి చుట్టూ తిరుగుతూ సస్పెన్స్ సన్నివేశాలతో రక్తి కట్టిస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా డైరెక్టర్ యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ చూస్తుంటే నిజంగానే అతను లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి ఏకలవ్య శిష్యుడని అర్థమవుతోంది. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన ''మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్'' ఫేమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రం లోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రాయగా దీపు, పావని ఆలపించారు. విజయ్ కూరాకుల సంగీతం అందించారు. చిత్రంలో హీరో నితిన్ ప్రసన్న 3 విభిన్నమైన పాత్రలు పోషించడం ఆసక్తికర అంశం. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ని థియేటర్స్ రీ ఓపెన్ కాగానే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XYIwYS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...