Sunday, 24 May 2020

చిరంజీవి సినిమాలో విజయశాంతి.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ కాంబినేషన్‌కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో 19 సినిమాలు రాగా.. వాటిలో ‘పసివాడి ప్రాణం’, ‘యముడికి మొగుడు’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘కొండవీటి దొంగ’, ‘గ్యాంగ్ లీడర్’ వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఆఖరి చిత్రం ‘మెకానిక్ అల్లుడు’. తరవాత కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. మరోవైపు కూడా రాజకీయాల్లోకి వెళ్లడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. Also Read: ప్రస్తుతం ఇటు చిరంజీవి, అటు విజయశాంతి ఇద్దరూ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. ముందుగా చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’తో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టగా.. విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’తో మళ్లీ మేకప్ వేసుకున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీరిద్దరూ పాల్గొని సందడి చేశారు. అయితే, ఇప్పుడు వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపించబోతున్నారని టాక్. సుధీర్ఘ విరామం తరవాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. Also Read: మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ‘లూసిఫర్’లో మంజు వారియర్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రను తెలుగులో విజయశాంతి చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా, తెలుగు నేటివిటీకి తగినట్టు ‘లూసిఫర్’ స్క్రిప్ట్‌లో సుజీత్ మార్పులు చేర్పులు చేశారట. దీన్ని చిరంజీవికి వినిపించగా ఆయన ఓకే చేసేశారట. ఈ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36yicZC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...