Sunday, 24 May 2020

పవన్ సినిమాలో పూజిత పొన్నాడ.. తెలుగమ్మాయికి లక్కీ ఛాన్స్!

షార్ట్ ఫిలింస్ నుంచి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి పూజిత పొన్నాడ. విశాఖపట్నంకు చెందిన ఈ బ్యూటీ 2016లో ‘తుంటరి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే, ‘రంగస్థలం’ సినిమా పూజితకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో లంగాఓణీలో చాలా పద్ధతిగా కనిపించిన పూజిత.. ఆ తరవాత మోడరన్ లుక్స్‌లో అదరగొట్టింది. ‘కల్కి’ సినిమాలో రొమాంటిక్ లేడీ ఎస్సైగా నటించింది. అయితే, ఇప్పుడు ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని టాక్. పవన్ సినిమాలో ఆమె ఛాన్స్ కొట్టేసిందట. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ ‘పింక్‌’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. వచ్చే నెల నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇదొక పీరియాడిక్ డ్రామా. ఈ సినిమాలో పవన్‌ రాబిన్‌‌హుడ్‌ తరహా పాత్రలో నటిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు హింట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో పవన్‌తో పూజిత పొన్నాడ ఆడిపాడనుందని అంటున్నారు. కానీ, దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒక వేళ ఇదే నిజమైతే పూజి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WVfBpk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...