Tuesday, 26 May 2020

ప్రభాస్‌తో త్రివిక్రమ్.. క్రేజీ కాంబోకి ముహూర్తం!

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో మాటల మాంత్రికుడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించారు. అయితే ఈ లిస్ట్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరబోతున్నారా అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి ఔననే సమాధానం వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ‌తో పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు. ‘సాహో’ చిత్రం తరువాత ప్రభాస్ ఈ చిత్రంతో గట్టి హిట్ కొట్టేందుకు పక్క ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ మూవీ తరువాత ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాన్ ఇండియా చిత్రం లైన్‌లో పెట్టారు ప్రభాస్. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్‌‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని రూపొందించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు త్రివిక్రమ్. అయితే ప్రభాస్-త్రివిక్రమ్ కాంబోలో ముహూర్తం సెట్ అయినట్టు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు దగ్గర ప్రభాస్‌కి సరిపడే కథ ఎప్పటి నుంచో రెడీ ఉందని.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న రెండు చిత్రాలు కంప్లీట్ కావడానికి 2022 వరకూ టైం పట్టే అవకాశం ఉండటంతో... 2022 తరువాత ప్రభాస్-త్రివిక్రమ్ మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ 30 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AUxzQ7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...