Tuesday, 26 May 2020

డిస్కవరీ వైల్డ్‌లో వినిపిస్తున్న ప్రకాశ్ రాజ్ గొంతు

ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయిన టీవీ చానల్‌ డిస్కవరీ. ప్రపంచంలోని అరుదైన సన్నివేశాలను తన కెమెరాలతో బందించి కళ్లకు కట్టేలా ప్రతీ దాన్ని చూపిస్తోంది. వీక్షకులకు కనువిందు చేయడంలో డిస్కవరీ ఛానల్‌ను మించింది లేదు. ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో అద్బుతాల్ని ఈ ఛానల్ మన ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ మూల కూడా డిస్కవరీ ఛానల్‌కు ప్రేక్షకులు ఉన్నారు. డిస్కవరీ ప్రధాన చానల్‌కు మరిన్ని అదనపు ఛానల్స్‌ను జోడిస్తూ ప్రపంచంలోని అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు డిస్కవరీ రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వైల్డ్‌ లైఫ్‌ అభిమానుల కోసం డిస్కవరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందుకు తగ్గట్టు అభిమానులను మరింత ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషలకు పరిచయమున్న గొంతులోనే కార్యక్రమాన్ని వివరించాలనుకుంటుంది డిస్కవరీ. దీంతో సౌత్‌ ఇండియాలో మంచి పేరున్న, మంచి వినదగ్గ గొంతు ఉన్న నటుల కోసం వెతుకుతుంది. ఈ క్రమంలోనే ఛానల్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను సంప్రదించింది సంస్థ. ఈ కార్యక్రమాలకు తన గొంతును ఇవ్వడానికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఆసక్తి చూపించారు. దీంతో ఆయన ఓకే చెప్పడంతో డబ్బింగ్‌ కార్యక్రమం కూడా మొదలయిపోయింది. తెలుగు, తమిళం భాషల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన వాయిస్‌ ద్వారా డిస్కవరీ వైల్డ్‌ లైఫ్‌ కార్యక్రమానికి తన గొంతు వినిపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నానంటూ ప్రకాశ్‌ రాజ్‌ తన గొంతుతో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. దీనికి అనేక మంది సెలెబ్రెటీలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రీ ట్వీట్‌ చేస్తున్నారు. మరోవైపు అభిమానులంతా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో చక్కని అవకాశం అంటూ ప్రశంసిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zw38PZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...