వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ లాక్‌డౌన్ సమయంలోనూ తన అభిమానులను అలరిస్తున్నారు. అది కూడా మియా మాల్కోవా లాంటి పోర్న్ స్టార్ సహాయంతో కావడం విశేషం. మియా మాల్కోవాతో గతంలో ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ ఫిల్మ్ తీసి సంచలనం సృష్టించారు ఆర్జీవీ. ఇప్పుడు ఆమెతోనే మరో షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. అయితే, శృంగార తారతో ఈసారి యాక్షన్ థ్రిల్లర్‌ను తీశారు. ఎడారిలో ఆమెను పరుగులు పెట్టించారు. అయినప్పటికీ యువతకు కావాల్సిన అందాల ఆరబోతకు మాత్రం లోటు లేదు. మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్ ‘క్లైమాక్స్’. శ్రేయాస్ ఈటీ సమర్పణలో ఆర్జీవీ కంపెనీ, ఆర్ఎస్‌ఆర్ ప్రొడక్షన్ ఈ లఘు చిత్రాన్ని నిర్మించాయి. ఎడారిలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా. మియా మాల్కోవా అందాలు, గాఢమైన శృంగారం, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉన్నట్టు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్‌పై మరింత ఆసక్తిని రేకెత్తించేందుకు ఈనెల 18న ఉదయం 9.30 గంటలకు ‘క్లైమాక్స్’ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. See Photos: కాగా, ఈ షార్ట్ ఫిల్మ్ ఆర్జీజీ ఛానెల్ ఎక్స్‌క్లూజివ్. రామ్ గోపాల్ వర్మ సొంత ఛానెల్‌లో ఈ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేయనున్నారు. అది ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది. మొత్తానికి ఈ లాక్‌డౌన్ వేడిలో ‘క్లైమాక్స్’తో మరింత సెగలు పుట్టిస్తున్నారు ఆర్జీవీ.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WX8hZ0
v
No comments:
Post a Comment