Thursday, 14 May 2020

మెగాస్టార్ నిజమైన వారసుడు బన్నీ.. చరణ్ తల పైకెత్తరు: మాధవి షాకింగ్ కామెంట్స్

ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్ ఇలా స్టార్ హీరోలందరితోనూ పనిచేసినప్పటికీ తనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అన్నారు మిర్చి ఫేమ్ మాధవి. ఇటీవల ఈమె మెగా హీరోలపై చేసిన షాకింగ్ కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. మాధవి మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ డౌన్ టు ఎర్త్.. చాలా మంచి వ్యక్తి. నేను చూసిన వాళ్లలో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన సినిమా కోసం మామూలు కష్టపడరు. డాన్స్, యాక్షన్ సీన్లు కోసం ప్రాణం పెట్టేస్తారు. ఆ జనరేషన్‌కి చిరంజీవి ఎలాగో.. ఈ జనరేషన్‌కి అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీకి నిజమైన వారసుడు ఆయనే అనిపిస్తుంది. అయితే మెగా హీరోల సినిమాల్లో నటించా. కాని ఏ హీరోతోనూ మాట్లాడలేదు. కాని ఒక్క అల్లు అర్జున్‌తో మాత్రమే మాట్లాడగలిగా. ఎందుకంటే ఆయన చాలా సింపుల్‌గా ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడతారు. రామ్ చరణ్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఎవడు సినిమాకి నేను పనిచేశా. అందులో నాది చిన్న పాత్రే కావడంతో చరణ్ గారి గురించి పెద్దగా తెలుసుకునే అవకాశం రాలేదు. పైగా రామ్ చరణ్ సెట్‌లో తల కిందకి పెట్టుకునే కూర్చుంటారు.. లేదంటే ఫోన్ చూస్తూ తల దించుకునే ఉంటారు. షాక్ ఓకే కాగానే మళ్లీ వచ్చి అదే పనిలో ఉంటారు. ఇలా ఉంటే వాళ్ల గురించి ఏం తెలుస్తుంది. పెద్దగా కమ్యునికేషన్ ఉండదు. ఇక ప్రతి హీరో, హీరోయిన్ క్యారవాన్‌లో ఉంటారు.. చుట్టూ సెక్యురిటీ ఉంటుంది. ఎవరైనా అడిగితే అప్పుడప్పుడు ఫొటోలు ఇస్తారు.. లేదంటే క్యాస్ట్యూమ్ స్టిల్స్ బయటకు వెళ్లకూడదనే కారణంతో ఫొటోలు కూడా ఇవ్వరు. ఇక షాక్ ఓకే కాగానే క్యారవాన్ దిగి బయటకు వస్తారు.. షాట్ చేస్తారు మళ్లీ వెళిపోతారు. ఏదైనా డిస్కషన్స్ ఉంటే డైరెక్టర్స్‌తో మాట్లాడుకుంటారు. తోటి ఆర్టిస్ట్‌లతో మాట్లాడేది చాలా తక్కువ. వాళ్లతో మాట్లాడే చాన్స్ చాలా తక్కువ’ అంటూ చెప్పుకొచ్చారు మాధవి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WzwENH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...