Friday, 29 May 2020

‘మా’ ప్రెసిడెంట్‌ని నాకే ఇన్ఫర్మేషన్ లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై నరేష్ కామెంట్స్

ప్రభుత్వాలతో జరిపే చర్చలకు తనను పిలవడం లేదంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యారు. బాలయ్య అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదన్న నరేష్.. టాలీవుడ్ పెద్దలు ప్రభుత్వాలతో జరిపిన చర్చలకు తనకూ ఇన్ఫర్మేషన్ లేదన్నారాయన. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన నరేష్ ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘నేను మా ప్రెసిడెంట్‌ని నాకూ ఏం చెప్పలేదు.. కాని ఎక్కడకు పిలుస్తారో అక్కడకు వెళ్లడమే మంచిది. సినిమా పరిశ్రమ అంతా ఒకటే.. చిన్న చిన్న విభేదాలు ఇండస్ట్రీలో ఉండొచ్చు. నిన్న నన్ను ఒక కార్యక్రమానికి పిలిచారు వెళ్లాను.. ఈరోజు పిలిచారు వెళ్లాను.. నాకు తోచిన సూచనలు ఇచ్చాను. పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే.. వాళ్లు ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ పిలవక పోతే ఆగిపోతా. ఏదైనా ఒక సర్వీస్‌గా మాత్రమే నేను భావిస్తున్నా.. బాలయ్య గారు అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు.. నేను టీవీలు కూడా చూడలేదు. పరిశ్రమ క్లిష్టపరిస్థితులో ఉన్నప్పుడు గట్టెక్కించడం అనేది అందరి బాధ్యత’ అంటూ గుర్తు చేశారు నరేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36Glda9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...