Friday, 22 May 2020

నా భర్త ఎంత అందంగా ఉన్నాడో.. చైతూను ఆట పట్టిస్తోన్న సమంత

లాక్ డౌన్‌తో ఖాళీగా మారిన సినీ తారలంతా సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. షూటింగ్లు, సినిమాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్న సెలబ్రిటీలు తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్ని పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తన భర్త నాగ చైతన్యను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసింది. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్త నాగచైతన్య ను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తుంటోంది సమంత. తాజాగా జరిగిన హీరో రానా రోకా ఫంక్షన్‌లో నాగచైతన్య, సమంత హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తొలుత రానా-మిహీకా దంపతులతో దగ్గుబాటి యంగర్‌ జనరేషన్‌ కలిసి దిగిన ఫొటోను సమంత షేర్‌ చేశారు. 2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు థ్యాంక్స్‌ చెప్పారు. అనంతరం ఫంక్షన్‌కు హాజరైన నాగచైతన్య ఫోటోను షేర్‌ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీ పోస్ట్‌ చేశారు. 'అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా??(భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు అందులో దూకడానికి)' అని పేర్కొన్నారు. భార్య చేసిన ఫన్నీ పోస్టుపై అంతే సరదాగా స్పందించాడు నాగచైతన్య. చూస్తుంటే ఇది ఇతరుల కలిసి చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందని అన్నారు. సమంత చేసిన ఈ పోస్టుపై ఫ్యాన్స్ వేలల్లో లైకులు కొడుతున్నారు. కాసేపటి క్రితమే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా సమంత పోస్టుకు లైక్ కొట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3e18y4a
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...