Thursday, 28 May 2020

బాలయ్య వ్యాఖ్యలపై తలసాని రియాక్షన్.. ముదిరిన వివాదం

టాలీవుడ్ మరో వివాదం రేగింది. ఇండస్టీని ఏలుతున్న రెండు పెద్ద ఫ్యామిలీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రి సాయంతో ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. సినిమా షూటింగ్‌లు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చలకు తనను పిలవకపోవడంపై ఫైర్ అయ్యారు నందమూరి . ఈ విషయంలో స్పందిస్తూ.. ఎవరైనా నన్ను పిలిచారా?? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి చర్చలు పెట్టుకున్నారు అంటూ నోరు జారిన బాలయ్య మంత్రి తలసాని పేరుని ప్రస్తావిస్తూ బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బాలయ్య వ్యాఖ్యలు సరికాదంటూ సి కళ్యాణ్ చురకలేయగా.. మెగా బ్రదర్ నాగబాబు ‘నోరు అదుపులో పెట్టుకో బాలయ్యా’అంటూ గట్టివార్నింగ్ ఇచ్చారు. అయితే తొలి నుంచి ఈ ఇష్యూలో కీ రోల్ పోషిస్తున్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బాలయ్య వ్యాఖ్యలపై స్పందించడానికి ఇష్టపడలేదు. భూములు పంచుకోవడానికి మీటింగ్ అంటూ బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన దృష్టికి రావడంతో.. ‘వీటిపై ఇప్పుడు స్పందించను.. ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో కనుక్కుని ఆ తరువాత స్పందిస్తా’ అన్నారు మంత్రి తలసాని. మొత్తానికి బాలయ్యను ఈ మీటింగ్‌కి కావాలనే తప్పించారా? లేక చిరంజీవి నేతృత్వం నచ్చక ఆయనే దూరంగా ఉన్నారా? లేక తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ చేసి టీఆర్ఎస్‌లో చేరిన తలసానితో పాత విభేదాలు కారణంగా బాలయ్య ఈ కామెంట్స్ చేశారా అన్నది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dcrk8L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...