Sunday, 17 May 2020

డిసెంబర్‌లో నితిన్ పెళ్లి.. ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా కారణంగా అన్నీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా చాలామంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కొందరైతే... కేవలం బంధువుల సమక్షంలో పెళ్లి తంతును ముగించారు. ఇటీవలే ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, హీరో నిఖిల్పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పోతే యంగ్ హీరో కూడా కరోనా కారణంగా వాయిదా పడింది. ఏప్రిల్‌లో జరగాల్సిన పెళ్లి లాక్ డైన్ కారణంగా నితిన్ పోస్ట్ పోన్ చేశాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16నే నితిన్ షాలినిల పెళ్లి చేయాలని కుటుంబ స‌భ్యులు అనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే నితిన్ పెళ్లి ఈ ఏడాది డిసెంబరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు అనుకుంటున్నట్లు సమాచారం. డిసెంబరు నాటికి కూడా కరోనా పూర్తిగా అదుపులోకి రాని అవకాశాలు కనపడుతుండడంతో తమ ఫాంహౌజ్‌లోనే నితిన్ పెళ్లి చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నితిన్ కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రేమించిన అమ్మాయి షాలినితో నితిన్ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితమే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ హీరోల పెళ్లిళ్లు ఇప్పటికే ఎంతో మందివి వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు యంగ్ హీరో నిఖిల్ వివాహం అయితే అయిపోయింది. ఆ తర్వాత జబర్దస్త్ మహేష్ కూడా పెళ్లి చేసుకున్నారు. త్వరలో హీరో రానా కూడా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అతని పెళ్లి కూడా డిసెంబర్‌లో నిర్వహించే అవకాశాలున్నాయని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో బ్యాచిలర్స్ అంతా మూడు మూళ్లు వేసేసి ఓ ఇంటి వారు అయిపోతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zJrWUw
v

No comments:

Post a Comment