Sunday, 17 May 2020

హాట్ టాపిక్: హైపర్ ఆదిపై అనసూయ షాకింగ్ కామెంట్.. బుల్లితెరపై మనోడు!

జబర్దస్త్ తెరపై పంచులతో పరేషాన్ చేస్తూ ఎంటర్‌టైన్ చేయడంలో దిట్ట కమెడియన్ హైపర్ ఆది. తనదైన కోణంలో పంచులేస్తూ కడుపుబ్బా నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. యాంకర్, జడ్జ్‌లపై జబర్దస్త్ పంచులేస్తూ కిక్కిస్తుంటాడు ఈ పంచ్ పటాకీ రాజ్. ఇక యాంకర్ అనసూయతో చేసే మజా అయితే మామూలుగా ఉండదు. తనదైన మాటల తూటాలు పేల్చుతూ ఆమెపై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తుంటాడు హైపర్. అంతేకాదు ఆమెతో రొమాంటిక్ డాన్సులేస్తూ కూడా అట్రాక్ట్ చేస్తుంటాడు. అందుకే జబర్దస్త్ వేదికపై అనసూయ- హైపర్ ఆది జోడీకి స్పెషల్ గుర్తింపు వచ్చింది. యాంకర్ స్థానంలో కూర్చుందంటే చాలు.. హైపర్ ఆదికి ఓ రకమైన పూనకం వచ్చేస్తుండటం గమనించవచ్చు. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ, కత్తిలాంటి పంచులేస్తూ క్షణాల్లో రక్తి కట్టించడం ఒక్క హైపర్ ఆదికే చెల్లుతుంది. అందుకే ఈ జంటను కూడా మరోలా ఊహించుకుంటూ ఉంటారు ఆడియన్స్. బుల్లితెరపై రష్మీ- సుధీర్ జంటకు ఏ రేంజ్ పాపులారిటీ ఉందో.. అనసూయ- హైపర్ ఆది జోడీకి అంతే ఫాలోయింగ్ ఉంది. Also Read: ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఆన్‌లైన్ చాట్‌‌లో హైపర్ ఆదిపై మీ ఒపీనియన్ ఏంటనే ప్రశ్న అనసూయకు ఎదురైంది. దీనికి ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆయనను గ్రేట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పోల్చి మరింత పరేషాన్ చేసింది అనసూయ. 'బుల్లితెరపై మాటల మాంత్రికుడు హైపర్ ఆది' అని చెబుతూ సిగ్గుమొగ్గలేసింది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇది చూసి హైపర్ ఆది ఫ్యాన్స్ యమ ఖుషీ అవుతున్నారు. ‘సూపర్ అనసూయ..’ సూపర్‌గా చెప్పావంటూ కామెంట్స్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా వేదికగా టచ్ లోకి వస్తోంది అనసూయ. అభిమానులతో చాట్ చేస్తూ జబర్దస్త్ మాటలతో వార్తల్లో నిలుస్తోంది. షూటింగ్స్ రీ ఓపెన్ కాగానే ఇటు జబర్దస్త్ ఎపిసోడ్స్ చేస్తూనే అటు సినిమా షూటింగ్స్‌లో కూడా బిజీ కానుంది ఈ బుల్లితెర బ్యూటీ.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bF8VzM
v

No comments:

Post a Comment