Tuesday, 26 May 2020

జెనీలియ భర్త ఎమోషనల్ ట్వీట్.. కంటతడి పెట్టించేలా వీడియో పోస్ట్

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ జెనీలియ భర్త, ప్రముఖ బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్‌ను గుర్తు చేసుకుంటూ వీడియో పోస్టు చేశారు. తండ్రి జ్ఞాపకార్థంగా ఉంచుకున్న దుస్తుల్ని హత్తుకుంటూ.. నిజంగా చనిపోయిన తండ్రి దగ్గరున్నట్లు ఫీల్‌ అయ్యాడు. ' హ్యాపీ బర్త్ డే పప్పా... నిన్ను ప్రతిరోజూ మిస్‌ అవుతున్నా' అని రితేష్‌ ట్వీట్‌ చేశారు. హ్యాంగర్‌కు తగిలించి ఉన్న కుర్తా స్లీవ్‌లోకి ఓ చేతిని ఉంచి.. తండ్రి తనను హత్తుకున్నట్లుగా రితేష్‌ వీడియోలో ఫీల్‌ అయ్యారు. బ్యాక్‌గ్రౌండ్‌లో హృతిక్ రోషన్ 2012 రిలీజ్ అయిన 'అగ్నిపత్‌' సినిమాలోని ‘అభి ముజ్‌మే కహీ..’అంటూ సాంగ్ వినిపిస్తోంది. రితేష్ ఫీలింగ్‌కు తగ్గట్టుగా ఆ పాట సాగడంతో.. ఆ వీడియో చూసిన వారందరికి కన్నీళ్లు పెట్టిస్తోంది. రితేష్ పోస్టు చేసిన వీడియోను చూసిన అనేక మంది ప్రముఖులు ట్వీట్లు చేశారు. నీ వీడియో కన్నీళ్లు పెట్టిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, మంచు లక్ష్మి, సుదీప్‌, ప్రియా గుప్తా తదితరులు కామెంట్లు చేశారు. అంతేకాదు విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ సన్నిహితులు కూడా వీడియోను రీట్వీట్‌ చేశారు. క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందిస్తూ.. 'ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాడు' అని ట్వీట్ చేశారు. మరోవైపు జెనీలియా కూడా మామయ్యను సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు. 'మీరే మా గర్వకారణం. మీరున్న భావన ప్రతి రోజూ కలుగుతోంది. మీరు ఎక్కడ ఉన్నా సరే మమ్మల్ని సంరక్షిస్తుంటారని తెలుసు. మీరు మాలోనే ఉన్నారు.. హ్యాపీ బర్త్‌డే' అని పోస్ట్‌ చేశారు. విలాస్ రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాజకీయాల్లో పట్టున్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో ముఖ్యనేత. 1999 నుంచి 2008 మధ్యకాలంలో రెండుసార్లు ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012లో అనారోగ్యంతో మరణించారు. విలాస్‌రావ్ సీఎంగా ఉన్న కాలంలోనే.. ఆయన కుమారుడు రితేశ్ ను బాలీవుడ్ హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయిన రితేశ్ 2012లో అప్పటికి స్టార్ హీరోయిన్ గానే వెలుగొందుతున్నజెనీలియాను పెళ్లిచేసుకున్నారు. అదే ఏడాదిలో తండ్రి విలాస్ రావ్ మరణించారు. అయితే రితేష్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gmjzip
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...