Thursday, 7 May 2020

వ్యక్తిగతంగా ఆమె క్యారెక్టర్ తెలియకే అలా చేశారు.. గీతామాధురి భర్త ఆసక్తికర వ్యాఖ్యలు

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 2లో రన్నరప్‌గా నిలిచిన జర్నీపై ఆమె భర్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గీతామాధురి బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఆమెను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని నటుడు, ఆమె భర్త నందు అన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ తాలూకు విషయాలు తెలిపారు. టాలీవుడ్‌లో సెలబ్రిటీ కపుల్స్ జాబితాలో గాయని గీతామాధురి- నటుడు నందు జోడీ ఒకటి. ఇటీవలే ఈ జంటకు ఓ పాప జన్మించింది. అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగిస్తున్న ఈ ఇద్దరూ తాజాగా ఓ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా తన భార్య గీత గురించి, బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ఎదుర్కొన్న విమర్శల గురించి ప్రస్తావించారు నందు. గీత మంచి గాయని అని అందరికీ తెలిసినప్పటికీ, వ్యక్తిగతంగా ఆమె క్యారెక్టర్ ఎవ్వరికీ తెలియదని నందు అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం గీతామాధురిది అని చెప్పారు. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లో గీత కచ్చితంగా ఇబ్బంది పడుతుందని తాను ముందుగానే ఉహించానని, అనుకున్నదే జరిగిందని ఆయన తెలిపారు. మొదట సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి కానీ క్రమంగా ఆమెను అందరూ అర్థం చేసుకొని, మంచి స్నేహితులయ్యారని చెప్పారు. అనంతరం గీతామాధురి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ బాగా పెరిగిందని చెప్పింది. యూట్యూబ్ లో థంబ్ నేల్ కటి పెట్టి లోపల మరొకటి పెడుతున్నారని, చాలాసార్లు తాము కూడా ఈ ఫేక్ న్యూస్‌ల వల్ల ఇబ్బంది పడ్డామని తెలిపింది. అయితే ఈ ఫేక్ న్యూస్‌లపై విజయ్ దేవరకొండ చేస్తున్న పోరాటానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అండగా నిలుస్తుండటం సంతోషించదగిన విషయమని చెప్పింది గీతామాధురి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yAclGy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...