ఓ వైపు లాక్డౌన్.. మరోవైపు టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లు. ఇదీ ప్రెజెంట్ సిచ్యుయేషన్. మొన్ననే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించగా, నేడు (మే 14) టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన ప్రేయసి పల్లవి మెడలో మూడుముళ్ళేశాడు. అయితే ఇదే రోజు మరో టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ కూడా జరిగింది. తాజాగా ఈ పెళ్ళికి సంబంధించిన పిక్స్ బయటకు రావడంతో పలువురు ప్రముఖులు అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన మహేష్.. తన బంధువుల అమ్మాయి పావనిని పెళ్లి చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ రోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు పావనితో ఏడడుగులు వేశాడు మహేష్. ఈ జోడీని చూసి 'నైస్ పెయిర్, అమ్మాయి చాలా చక్కగా ఉంది' అంటూ అంతా అభినందిస్తున్నారు. అతని పూర్తిపేరు మహేష్ ఆచంట. ‘జబర్దస్త్’ కామెడీ షోలో ‘కిరాక్ ఆర్పీ’ టీమ్ ద్వారా బుల్లితెరకు పరిచయమై ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు మహేష్. అతి తక్కువ సమయంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రంగస్థలం చిట్టిబాబు అసిస్టెంట్ పాత్రలో తనదైన హావభావాలతో అందరినీ మెప్పించాడు మహేష్. ‘‘శతమానం భవతి, మహానటి, ప్రతీరోజు పండగే’’ సినిమాల్లో ఆయన నటించాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LtJDtU
v
No comments:
Post a Comment