Monday, 4 May 2020

స్టే హోం.. ప్రేమ పొందండి, ప్రెగ్నెన్సీ కాదు: నటుడి కూతురు షాకింగ్ పోస్ట్

కరోనా ఎఫెక్ట్ వల్ల కండోమ్‌లకు కొరత ఏర్పడిందట.. వినిడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. ఇది నిజమే. లాక్ డౌన్‌ వల్ల ఇంట్లోనే ఉంటూ కండోమ్‌లను విపరీతంగా వాడేస్తున్నారా? అందుకే ఈ కొరత ఏర్పడిందా అంటే అదేం కాదు. కండోమ్‌ కంపెనీల్లో దిగ్గజ పరిశ్రమ ‘కేరెక్స్’ లాక్ డౌన్‌ ఎఫెక్ట్‌తో మూసేయడంతో ఒక్కసారిగా కండోమ్‌ల కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడం.. సిబ్బంది కొరతతో కండోమ్‌ల ఉత్పత్తి సగానికి పైగా పడిపోవడంతో కొరత ఏర్పడింది. ఆ రకంగా కండోమ్‌లకు లాక్ డౌన్‌లో భారీ గిరాకీ ఏర్పడింది. ఈ ముచ్చట పక్కన పెడితే.. లాక్ డౌన్‌లో చాలా మంది ఆఫీస్‌లు ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి ఇళ్లకే పరిమితం కావడంతో ఆసుపత్రుల్లో గర్భవతుల తాకిగి ఎక్కువైందట. ఈ మాట చెప్తుంది ఎవరో కాదు.. ప్రముఖ డాక్టర్ పల్లవి. తమిళ నటుడు, జానపద గాయకుడు పుష్పవనం కుప్పుస్వామి డాటర్ అయిన డాక్టర్ ఫేస్ బుక్‌లో విచిత్రమైన పోస్ట్ పెట్టింది. డాక్టర్‌గా సేవలందిస్తున్న ఈమె లాక్ డౌన్‌లో తన ఆసుపత్రిలో వస్తున్న కేసుల గురించి ప్రస్తావిస్తూ.. ‘స్టే హోమ్.. స్టే సేఫ్.. ఈ లాక్ డౌన్‌లో ఒకర్నించి ఒకరు ప్రేమను పొందండి.. పిల్లల్ని కాదు.. హాస్పటల్స్‌కి చాలా గర్భవతి కేసులు వస్తున్నాయి’ అంటూ తల బాదుకునే ఎమోజీని జతచేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది పల్లవి అగర్వాల్. అయితే ఆమె పెట్టిన పోస్ట్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ddhC5n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...