సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. చిత్రసీమకు చెందిన ప్రముఖుల వరుస మరణాలు సినీ లోకాన్ని కలవరపెడుతున్నాయి. 2020వ సంవత్సరం సినిమా రంగానికి చెడ్డ రోజులను తెచ్చిందేమో అనిపిస్తోంది. బాలీవుడ్ పరిశ్రమలో గతకొద్ది రోజుల్లో వరుసగా చోటుచేసుకున్న మరణాలు అందరినీ షాక్‌కి గురి చేశాయి. నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణాల తాలూకు విషాదాలు ఇంకా వెంటాడుతూ ఉండగానే.. ఇంతలో సినీ పరిశ్రమ నుంచి మరో మరణవార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ రచయిత, భోజ్‌పురి దర్శకుడు మే 4వ తేదీన బీహార్ లోని పాట్నాలో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలిసింది. ‘జై గంగాజల్’, ‘అపహరణ్’, ‘దిల్ క్యాకరే’ తదితర చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ భోజ్‌పురిలో ‘హమ్ బాహుబలి’, ‘రణ్‌భూమి’, ‘ఏక్ దుజే కేలియే’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనిల్ మరణవార్తతో మరోసారి సినీ వర్గాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణం పట్ల భోజ్‌పురి, బాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dlecxQ
v
No comments:
Post a Comment