ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వెబ్‌సైట్స్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో విజయ్ పేర్కొన్న అంశాలకు టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మద్దతు పలుకుతున్నారు. హీరో మహేష్ బాబు మొదలుకొని అల్లరి నరేష్, రవితేజ, నాగబాబు సహా సైతం విజయ్‌కి అండగా నిలుస్తూ సపోర్టింగ్ ట్వీట్స్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ''విజయ్ మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ వెంట మేమంతా ఉన్నాము. మంచి పనిచేసే విషయంలో ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు'' అని పేర్కొంటూ వెన్నుతట్టారు. అదేవిధంగా జర్నలిస్టులను రిక్వెస్ట్ చేసిన చిరంజీవి.. దయచేసి మీ సొంత అభిప్రాయాల్ని రుద్దకుండా వార్తను వార్తలాగా రాయాలని అన్నారు. దీంతో కొన్ని వెబ్‌సైట్ల ధోరణిపై తన స్పందనను సపోర్ట్ చేసిన చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయ్ దేవరకొండ. ''నేను 5 సంవత్సరాలుగానే ఇలాంటివి చూసి భరించలేకపోతున్నా. అలాంటిది మీరు 42 సంవత్సరాలుగా ఇలాంటివి ఎన్ని అనుభవాలు ఎదుర్కొంటూ ముందుకొచ్చారో ఉహించకోగలను. డాడీ మీకు జరిగిన సిచుయేషన్స్ చెబుతుంటారు. మీరు అవన్నీ దాటి వాళ్ళని క్షమించి ఇంకా మమ్మల్ని గైడ్ చేస్తున్నారు'' అని పేర్కొంటూ ట్వీట్ చేశారు విజయ్. ప్రస్తుతం #KillFakeNews అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో హోరెత్తిపోతోంది. విజయ్ మాటలను సపోర్ట్ చేస్తూ తెలుగు సినీ తారలంతా ఈ హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. చూస్తుంటే అసత్యపు వార్తలు రాస్తున్న వెబ్‌సైట్లపై యుద్ధం ప్రారంభమైందని స్పష్టంగా తెలుస్తోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c5A8N5
v
No comments:
Post a Comment