Thursday, 7 May 2020

అది నా అదృష్టం.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా అది: చిరంజీవి

మెగస్టార్ , అతిలోక సుందరి శ్రీదేవి హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. 1990లో విడుదలైన ఈ చిత్రం మే 9తో 30 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతోంది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వైజయంతీ మూవీస్ ఇప్పటికే ఒక వీడియోను విడుదల చేసింది. నాని వాయిస్ ఓవర్‌తో రూపొందించిన ఆ వీడియోలో అసలు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా ఎలా రూపాంతరం చెందిందో వివరించారు. అయితే, ఈ సినిమా హీరోయిన చిరంజీవి.. గురువారం తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం వచ్చి 30 సంవత్సరాలు పూర్తికావస్తోన్న ఈ శుభ తరుణంలో ఆ సినిమాతో సంబంధం, అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సినిమా అనేది సమిష్టి కృషి ఫలితం అని అనడానికి సరైన ఉదాహరణ ఈ సినిమా. ప్రతి టెక్నీషియన్, నటీనటులు, వాళ్ల వాళ్ల ప్రతిభను కనబరుస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి, క్లాసిక్ కావడానికి కారణమయ్యారు’’ అని చిరంజీవి తన వీడియోలో వెల్లడించారు. Also Read: తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 25 మూవీస్‌లో చోటు దక్కించుకునేంత గొప్ప చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను జనరేషన్ గ్యాప్ లేదని అన్నారు. ఇది పాత తరం సినిమా, కొత్త తరం సినిమా అని చెప్పే అవకాశమే లేదని తెలిపారు. ఆ తరం ఈ తరం అనే తేడా లేని ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమా ఇదని చిరంజీవి గర్వంగా చెప్పారు. ఇలాంటి సినిమాలో తనకు నటించే అవకాశం దక్కినందుకు తన నటజీవితంలో దక్కిన గొప్ప అదృష్టంగా తాను భావిస్తున్నానని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3b8YRil
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...